వర్గ పోరుతో వేగలేకపోతున్న.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

by Sridhar Babu |   ( Updated:2021-01-28 05:45:55.0  )
వర్గ పోరుతో వేగలేకపోతున్న.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లాలో వర్గపోరు ఎక్కువగా ఉందని వారితో వేగే పరిస్థితి లేకుండా పోయిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కువగా పెద్దపల్లి, రామగుండం, మంథనిలో ఇలాంటి సమస్యలు ఎదరవుతున్నాయని అన్నారు. దీంతో జనవరి 4న తాను జిల్లా అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగే పరిస్థితి లేదని వివరిస్తూ అధిష్టానానికి లేఖ రాశానని చెప్పారు. అంతేకాకుండా రామగుండంలో కూడా మరో నాయకున్ని ఎంపిక చేసుకున్నా తనకు అభ్యంతరం లేదని కూడా చెప్పానని అయితే అధిష్టానం మాత్రం తననే కొనసాగాలని కోరినట్టు సోమారపు సత్యనారాయణ చెప్పారు. బీజేపీ అధిష్టానం ఆహ్వానించినందుకే బీజేపీలో చేరానని, అలాగే పదవి కావాలని అధిష్టానాన్ని అభ్యర్థిచంలేదన్నారు. త్రిమేన్ కమిటీ వచ్చి జిల్లా అధ్యక్ష్య బాధ్యతలు చేపట్టాలని సూచించినప్పుడు ఇక్కడి కార్యకర్తలు అభిప్రాయం తెలుసుకోవాలని తానే సూచించానని సోమారపు సత్యనారాయణ తెలిపారు. 80 శాతం మంది మీకే అనుకూలంగా ఉన్నారని త్రిమేన్ కమిటీ చెప్పడంతో తానీ బాధ్యతలు చేపట్టానని స్పష్టం చేశారు.

అయితే పార్టీ కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కరికీ సమాచారం ఇస్తున్నా… కొందరు మాత్రం ప్రత్యామ్నాయంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారని సోమారపు ఆసక్తికర చేశారు. బీజేపీలో పదవులు రావాలంటే క్లీన్ చిట్ ఉండాలని, క్రమ శిక్షణ కూడా ఎంతో ముఖ్యమని అన్నారు. అయితే పెద్దపల్లి జిల్లాలో కొంతమంది విభిన్నంగా వ్యవహరిస్తుండడం ఆవేదన కల్గిస్తోందని చెప్పారు. జిల్లా కమిటీని వేసేందుకు అన్ని విషయాలను బేరీజు వేసుకుని ఫైనల్ లిస్ట్ చేసి అధిష్టానానికి పంపించానని చెప్పారు. అంతేగాకుండా జిల్లాకు చెందిన ఓ నాయకుడు తానే జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టబోతున్నాని చెప్పుకుంటున్నాడని, అయితే అలాంటి ఛాన్స్ అతనికి రాదని స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షుడు కాదుకదా కనీసం ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా కూడా ఆయనకు బాధ్యతలు ఇవ్వరని సోమారపు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed