ఏసీబీ వలలో పెద్ద అంబర్‌పేట మున్సిపల్ కమిషనర్

by Sumithra |
ఏసీబీ వలలో పెద్ద అంబర్‌పేట మున్సిపల్ కమిషనర్
X

దిశ, రంగారెడ్డి: పెద్ద అంబర్‌పేట్ మున్సిపల్ కమిషనర్ ఎల్.రవీందర్ రావు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. కుంట్లూర్‌కు చెందిన వెంకట్‌రెడ్డి అనే వ్యక్తి తన పాత ఇంటిని కూల్చేసి అనుమతులు తీసుకొని కొత్త ఇంటి నిర్మాణం చేపట్టాడు. అయితే ఇంటి నిర్మాణం చేపట్టినప్పటి నుంచి ఏదో ఒక లిటికేషన్ పెడుతూ కమిషనర్ పనులు ఆపించాడు. స్థానిక ఓ లీడర్‌తో కలిసి కమిషనర్ రూ.2.5లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు బాధితుడు తెలిపాడు. చివరికి రూ.1.5లక్షలకు ఒప్పుకుని బాధితుడు ఏ‌సీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో మంగళవారం రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు కమిషనర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గతంలో కూడా ఈ కమిషనర్‌‌పై అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ ఫిర్యాదు చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదని సమాచారం.

Advertisement

Next Story