- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొదటిసారి మహిళపై పీడీ యాక్ట్ అమలు
దిశ, రామగుండం: సింగరేణి పవర్ ప్లాంటులో ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసిన మహిళపై పీడీ యాక్ట్ అమలు చేశారు పోలీసులు. రామగుండం సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లాకు చెందిన గడ్డం సుశీల అనే మహిళ స్థానిక దినపత్రికల్లో ఉద్యోగ ప్రకటనలు ఇచ్చేది. ఈ క్రమంలో తన వద్దకు వచ్చిన నిరుద్యోగులకు సింగరేణి పవర్ ప్లాంటులో ఉద్యోగాలు ఇప్పిస్తానని పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేంది.
మరోవైపు గోదావరిఖని, మంచిర్యాల జిల్లాలో నిరుద్యోగ యువత, ప్రైవేటు ఉద్యోగస్తులతో పరిచయం పెంచుకునేది. అనంతరం వారికి సైతం సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసేది. బాధితులు సుశీలను నిలదీయడంతో వారిపై బెదిరింపులకు పాల్పడేది. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితురాలిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని వరంగల్ జిల్లా కేంద్రానికి తరలించారు.