ఉప ఎన్నిక రావడానికి కారణమిదే.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Anukaran |
TPCC Chief Revanth Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్ ఉప ఎన్నికపై టీపీసీసీ చీఫ్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌‌ల మధ్య ఆధిపత్య పోరు వల్లే హుజురాబాద్ ఉప ఎన్నికలొచ్చాయని అన్నారు. ఆధిపత్య పోరుతో ఉద్యమాల గడ్డను తాగుబోతుల అడ్డాగా మార్చారని మండిపడ్డారు. టీఆర్ఎస్, బీజేపీ కలిసి తెలంగాణ పరువును దిగజారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టినట్లు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు.

కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ అనామకుడైతే సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు కూడా అనామకులే అని ఎద్దేవా చేశారు. బల్మూరి వెంకట్ ఒక చదువుకున్న నిరుద్యోగి అని, నిరుద్యోగుల పక్షాన అనేక ఉద్యమాలు చేశాడని గుర్తుచేశారు. బల్మూరి వెంకట్ పార్టీలు మారే వ్యక్తి కాదని, చచ్చేవరకూ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాడని హామీ ఇచ్చారు. ఇంటికో ఓటు వేసి ప్రశ్నించే గొంతుక అయిన విద్యార్థి నాయకుడ్ని అసెంబ్లీకి పంపించాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి హుజురాబాద్ ప్రజలను కోరారు.

Advertisement

Next Story