- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అబూదాబీలో పీఎస్ఎల్..?
దిశ, స్పోర్ట్స్: కరోనా కారణంగా వాయిదా పడిన పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)ను అబుదాబీలో నిర్వహించాలని పీసీబీ నిర్ణయించింది. ఈ మేరకు యూఏఈ ప్రభుత్వం నుంచి అనుమతులు మంజూరు అయినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. మార్చిలో కరోనా కేసులు పెరగడంతో పాటు పలు ఫ్రాంచైజీలకు చెందిన క్రికెటర్లకు కరోనా సోకడంతో పీఎస్ఎల్‌ను 14 మ్యాచ్‌ల తర్వాత వాయిదా వేశారు. దీంతో మిగిలిన మ్యాచ్‌ల నిర్వహణ కోసం రెండు నెలల పాటు మంతనాలు జరిపిన పీసీబీ ఎట్టకేలకు అబుదాబీ వేదికగా పూర్తి చేయడానికి నిర్ణయించింది.
‘యూఏఈ ప్రభుత్వం నుంచి ప్రస్తుతం అన్ని రకాల అనుమతులు మంజూరు అయ్యాయి. పీఎస్ఎల్ లోని మిగిలిన 20 మ్యాచ్‌లను అబుదాబీలో నిర్వహిస్తాము’ అని పీసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. పీసీబీ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయడానికి పీసీబీ అధికారులు ఒకటి రెండు రోజుల్లో యూఏఈ వెళ్లనున్నారు. జూన్ 1 నుంచి 20 వరకు పీఎస్ఎల్ యూఏఈ వేదికగా జరగనున్నట్లు పీసీబీ తెలిపింది.