- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జోక్‌గా కత్తి చూపిస్తే.. బెదిరింపులు అంటారా!
దిశ, స్పోర్ట్స్: ‘యూనిస్‌ఖాన్ టీమ్ సమావేశంలో ఇచ్చిన సలహాను పరిగణనలోనికి తీసుకోనందుకు నన్ను కత్తితో బెదిరించాడు’ అని పాక్ మాజీ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ వ్యాఖ్యానించడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రాంట్ ఫ్లవర్ చేసిన ఆరోపణలు పీసీబీ, పాక్ టీమ్ మేనేజ్‌మెంట్ ఖండించింది. గ్రాంట్ ఫ్లవర్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, యూనిస్ ఖాన్ టీమ్ సమావేశ సమయంలో సరదాగా కూరగాయల కత్తితో ఆట పట్టిస్తే దాన్ని గ్రాంట్ ఫ్లవర్ వేరేలా ఊహించుకున్నాడని పీసీబీ స్పష్టం చేసింది. వాళ్లందరూ బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న సమయంలో గ్రాంట్ ఫ్లవర్ సలహాలు ఇస్తుంటే, తినే సమయంలో కూడా ఎందుకీ సలహాను అని సరదాగా కత్తి చూపించాడు. అంత మాత్రాన దాన్ని సీరియస్‌గా ఎందుకు తీసుకున్నాడో అర్థం కాలేదు అని పీసీబీ వ్యాఖ్యానించింది. అయినా పాకిస్తాన్ జట్టుతో పని చేసిన కోచ్‌లు కాని, సపోర్టింగ్ స్టాఫ్ కాని ఒకసారి తమ కాంట్రాక్ట్‌లు ముగిసిపోయిన తర్వాత గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని ఇలా బహిర్గతం చేయడాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తప్పుబట్టింది. ఇది వారికి ఏమాత్రం సరికాదని పేర్కొంది. ఒక జట్టుకు కోచ్‌గా పని చేసి వెళ్లిపోయినప్పుడు ఎందుకు కొన్ని అంశాల్ని తెరపైకి తీసుకొస్తున్నారో అర్థం కావడం లేదని పీసీబీలోని ఒక సీనియర్ అధికారి అన్నారు.