వచ్చే ఏడాది నుంచి మొబైల్ వ్యాలెట్‌లనూ మార్చుకునే అవకాశం!

by Harish |   ( Updated:2021-05-20 06:03:34.0  )
వచ్చే ఏడాది నుంచి మొబైల్ వ్యాలెట్‌లనూ మార్చుకునే అవకాశం!
X

దిశ, వెబ్‌డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) లైసెన్స్ పొందిన మొబైల్ వ్యాలెట్లకు సంబంధించి కీలక సర్క్యులర్‌ను జారీ చేసింది. గతంలో టెలికాం రంగంలో ఫోన్ నంబర్ల పోర్టబులిటీ తరహాలో మొబైల్ వ్యాలెట్లను కూడా మార్చుకునే అవకాశం వినియోగదారులకు ఇవ్వాలని ఆర్‌బీఐ సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ కొత్త నిబంధనలు 2022, ఏప్రిల్ నుంచి అమల్లోకి రావాలని ఆయా సంస్థలను కోరింది. ఫోన్‌పే, పేటీఎమ్, గూగుల్ పే, మొబిక్విక్ వంటి మొబైల్ వ్యాలెట్లను వాడుతున్న కస్టమర్లు వీటిలో నచ్చిన సంస్థలోకి మారే అవకాశాన్ని ఈ కొత్త విధానం కల్పిస్తుంది. దీనివల్ల కస్టమర్ల వివరాల్లో ఎలాంటి మార్పులు ఉండవు.

వ్యాలెట్ కంపెనీ మాత్రమే మారుతుంది. ఆర్‌బీఐ జారీ చేసిన సర్క్యులర్ వివరాల ప్రకారం.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ మార్పులు అమల్లోకి వచ్చేలా ప్రక్రియ మొదలుపెట్టాలని మొబైల్ వ్యాలెట్ కంపెనీలను కోరింది. లైసెన్స్ పొందిన అన్ని ప్రీ-ప్రెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్(పీపీఐ)లు పరస్పరం మార్చుకునే విధానాలను అమలు చేయాలని తెలిపింది. కేవైసీ నిబంధనలు పూర్తి చేసిన కస్టమర్లు మొబైల్ వ్యాలెట్ల నుంచి నగదు పంపడం, తీసుకోవడం చేసుకోవచ్చు. అంతేకాకుండా మొబైల్ వ్యాలెట్ల నుంచి రూ.2 వేల వరకు డబ్బు విత్‌డ్రా చేసుకునే అవకాశం, వ్యాలెట్ పరిమితి(లిమిట్)ని రూ. లక్ష నుంచి రూ. 2 లక్షలకు పెంచింది.

Advertisement

Next Story