- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పేటీఎంలో ఇక స్టాక్ ట్రేడింగ్ రూ.10తోనే…
దిశ, వెబ్ డెస్క్: ఆన్లైన్ పేమెంట్ యాప్ పేటీఎం (paytm) తన పేటీఎం మనీ ప్లాట్‌ఫాంపై త్వరలో స్టాక్ ట్రేడింగ్ (stock trading) సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ పై పేటీఎం ఎక్స్‌పెరిమెంట్ చేస్తోంది. ఎంపిక చేసిన వినియోగదారులు కొందరికి ఇప్పటికే ఈ సౌకర్యాన్ని అందించి పరీక్షిస్తోంది. ఇందులో మొదట కేవలం రూ.10తోనే స్టాక్స్ ట్రేడ్ చేసేలా పేటీఎం వినియోగదారులకు సౌకర్యం కల్పించనుంది.
పేటీఎం మనీలో స్టాక్ ట్రేడింగ్‌లో పలు ఫీచర్లను అందివ్వనున్నారు. ఒకేసారి 50 స్టాక్స్‌కు ప్రైస్ అలర్ట్స్ సెట్ చేసుకుని ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ లను కూడా పొందవచ్చు. రేట్స్ పెరిగినా, తగ్గినా సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే ఇన్వెస్టర్లు 50 స్టాక్స్‌కు సంబంధించిన సమాచారాన్ని రియల్‌టైంలో తెలుసుకునే అవకాశం ఉంది.
ఇక స్టాక్స్‌ను వీక్లీ, మంత్లీ పద్ధతిలో ఆటోమేట్ చేసుకోవచ్చు. ఇందులో బిల్టిన్ బ్రోకరేజ్ కాలిక్యులేటర్ ను అందించనున్నారు. దీని వలన లాభసాటిగా ఉండే స్టాక్స్‌ను ఎప్పటికప్పుడు అమ్ముకోవచ్చు. ఇక పేటీఎం మనీలో స్టాక్ ట్రేడింగ్ చేసే వారి డేటా పూర్తి సేఫ్ గా ఉంటుందని పేటీఎం వెల్లడించింది. ఆండ్రాయిడ్, వెబ్ ప్లాట్‌ఫాంలపై ముందుగా పేటీఎం స్టాక్ ట్రేడింగ్ అందుబాటులోకి రానుంది. ఆ తరువాత పేటీఎం ఐఓఎస్ యూజర్ల (paytm ios users) కు ఈ ఫీచర్‌ను అందిస్తారు. దీన్ని అతి త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు.