- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యాపారులకు పేటీఎమ్ భారీ ఆఫర్!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆన్‌లైన్ చెల్లింపుల సంస్థ పేటీఎమ్ దేశీయ వ్యాపారులకు సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. వ్యాపారులు నిర్వహించే లావాదేవీలపై అన్ని రకాల ఛార్జీలను రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. పేటీఎం వాలెట్, రూపే కార్డు, యూపీఐ యాప్‌ల ద్వారా జరిపే చెల్లింపులపై ఎటువంటి ఛార్జీలను వసూలు చేయమని వెల్లడించింది. ఈ నిర్ణయంతో భారత్‌లో డిజిటల్ చెల్లింపులకు వ్యాపారులను ప్రోత్సహించవచ్చని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని చేరుకునేందుకు వీలవుతుందని పేటీఎమ్ పేర్కొంది.
అదేవిధంగా పేటీఎమ్ ఆల్ ఇన్ వన్ క్యూఆర్, పేటీఎమ్ సౌండ్ బాక్స్, పేటీఎమ్ ఆల్ ఇన్ వన్ ఆండ్రాయిడ్‌లను వినియోగిస్తున్న దాదాపు 1.7 కోట్ల వ్యాపారులకు లబ్ది ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా.. సూక్ష్మ, చిన్న మధ్య తరహా వ్యాపారులను ప్రోత్సహించే విధంగా సుమారు రూ. 600 కోట్ల ఏండీఆర్ ఛార్జీలను పేటీఎం భరిస్తుందని పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కుమార్ ఆదిత్య చెప్పారు. ఈ ఛార్జీలను మాఫీ చేయడం ద్వారా పేటీఎమ్ ఆల్ ఇన్ వన్ క్యూఆర్, పేటీఎమ్ సౌండ్ బాక్స్, పేటీఎమ్ ఆల్ ఇన్ వన్ ఆండ్రాయిడ్ వంటి ఆపరేటింగ్ విధానాన్ని వినియోగించే ఎంఎస్ఎంఈలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి చేరుతాయని ఆయన వివరించారు.
అలాగే, 2021 మార్చి నాటికి ఎంఎస్ఎంఈలకు రూ. వెయ్యి కోట్ల రుణాలను ఇవ్వాలని నిర్ణయించినట్టు పేటీఎం తెలిపింది. ఈ రుణాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే మొత్తం ప్రక్రియను డిజిటలైజ్ చేసినట్టు, ఎన్‌బీఎఫ్‌సీ, బ్యాంకుల భాగస్వామ్యంతో అదనపు కాగితాలు అవసరం లేకుండా పంపిణీ చేయనున్నట్టు పేటీఎమ్ వెల్లడించింది.