నంది మరణం కాంగ్రెస్‌కు తీరని లోటు

by Shyam |
నంది మరణం కాంగ్రెస్‌కు తీరని లోటు
X

దిశ, సిద్ధిపేట: మాజీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు నంది ఎల్లయ్య అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని కాంగ్రెస్ నాయకుడు దరిపల్లి చంద్రం అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్ధిపేట పార్లమెంట్ స్థానానికి 6 సార్లు ఎంపీగా గెలిచి సిద్ధిపేట పార్లమెంట్ స్థానాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసిన మహనీయులు అన్నారు. కాంగ్రెస్ పార్టీ నంది ఎల్లయ్యను గౌరవిస్తూ రాజ్యసభ సభ్యునిగా రెండుసార్లు నియమించిందని గుర్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీ దేశంలో, రాష్ట్రంలో బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేసిన నంది ఎల్లయ్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. నంది ఎల్లయ్య మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి నంది ఎల్లయ్య అన్నారు. దళిత సామాజిక వర్గానికి ఎన్నో సేవలు అందించిన మహనీయుడన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నకోడూరు మండల అధ్యక్షులు మిట్టపల్లి గణేష్, ఉమేష్, రాజేష్ మాజర్ మాలిక్, అత్తు ఇమామ్, వంగరి నాగరాజు, అజర్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story