బెదిరింపు ఆరోపణలు.. నటి పాయల్ అరెస్ట్

by Shyam |   ( Updated:2021-06-25 21:36:55.0  )
Payal Rohatgi arrested
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటి ‘బిగ్ బాస్’ ఫేమ్ పాయల్ రోహత్గిని పోలీసులు అరెస్ట్ చేశారు. వాట్సాప్ గ్రూపులో పాయల్ తన హౌసింగ్ సొసైటీ చైర్ పర్సన్ కు బెదిరింపు సందేశాలు పంపినట్లు ఆమెపై ఆరోపణలు రావడంతో సొసైటీ మెంబెర్ అయిన డాక్టర్ పరాగ్ షా ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అహ్మదాబాద్ శాటిలైట్ పోలీసులు ఆమెను శుక్రవారం అరెస్ట్ చేశారు. జూన్ 20న సొసైటీ వార్షిక సర్వసభ్య సమావేశానికి హాజరైన పాయల్ స్టేజీపై మాట్లాడడానికి సిద్దమయ్యింది.

అయితే ఆ సోసైటీలో పాయల్ సభ్యురాలు కాకపోవడంతో ఆమెను మాట్లాడకూడదని సొసైటీ పెద్దలు కోరారు. ఈ నేపథ్యంలో వారితో పాయల్ వాగ్వాదానికి దిగింది. ఆ తర్వాత గ్ సొసైటీ చైర్ పర్సన్ కు తనతో వాదించే ఎవరికైనా కాళ్లు విరిగిపోతాయని.. చైర్ పర్సన్ ను చంపేస్తానని వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ చేసింది. అనంతరం ఆ మెసేజ్ ని డిలీట్ చేసినట్లు సొసైటీ పెద్దలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాయల్ ను అహ్మదాబాద్ లో అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story