బిజినెస్‌లోకి అడుగుపెట్టిన పాయల్

by Shyam |
బిజినెస్‌లోకి అడుగుపెట్టిన పాయల్
X

దిశ, వెబ్‌డెస్క్: ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్ కెరీర్‌లో సూపర్ సబ్జెక్ట్స్ చూజ్ చేసుకుంటూ దూసుకుపోతుంది. అదే స్పీడ్‌తో బిజినెస్ రంగంలోనూ అడుగుపెట్టింది భామ. అక్కినేని వారి కోడలు సమంత మాదిరిగా సొంతంగా క్లాథింగ్ బ్రాండ్ ఓపెన్ చేసింది. ‘‘GOOMFY’’ పేరుతో వస్తున్న క్లాథింగ్ బ్రాండ్‌కు మీ ఆశీర్వాదం కావాలని అభిమానులను కోరింది.

ధనత్రయోదశి సందర్భంగా కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపిన పాయల్..కొత్త లక్ష్యాన్ని సెట్ చేసేందుకు, కొత్తగా కల కనేందుకు, వయసుతో సంబంధం లేదని అంటుంది. GOOMFY‌లో హ్యాపీగా షాపింగ్ చేయండి అంటూ దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. మీకు ఇష్టమైన, మీరు కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యే దుస్తులను దరించాలని చెప్తున్న పాయల్..లేటెస్ట్ కలెక్షన్ బాగుంది. స్పెషల్ వింటర్ కలెక్షన్ కూడా అవెలేబుల్‌లో ఉండగా..ధరలు కూడా రీజనెబుల్‌గా ఉన్నాయి. పాయల్ కొత్త ప్రయత్నానికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు ఫ్యాన్స్ అండ్ ఫ్రెండ్స్.

Advertisement

Next Story