- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుకుమారుడితో కమిట్ అయిన బోల్డ్ బ్యూటీ
దిశ, సినిమా : ప్రేమకావాలి, లవ్లీ, సుకుమారుడు’ వంటి సినిమాలతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆది. సాయికుమార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తను.. జయాపజయాలతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ పంచుతున్నాడు. చివరగా ఆది నటించిన ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్, శశి’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో కథల ఎంపికలో జాగ్రత్తలు వహిస్తున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలు లైన్‌లో పెట్టిన ఆది.. ‘నాటకం’ చిత్రాన్ని రూపొందించిన కళ్యాణ్‌జీ గోగణ దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయ్యాడు. కాగా ఈ సినిమాలో ఆదికి జోడీగా ‘ఆర్‌ఎక్స్100’ భామ, బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్‌ను ఎంపిక చేశారు మేకర్స్.
ఈ రోజు(ఆదివారం) హైదరాబాద్‌లో లాంచనంగా షూటింగ్ ప్రారంభించగా.. రెగ్యులర్ షూటింగ్‌ను సోమవారం నుంచి మొదలుపెడతామని ప్రకటించారు. విజన్ సినిమాస్ పతాకంపై ‘టీఎంకే’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న చిత్రాన్ని ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి నిర్మించనున్నారు. కమెడియన్ సునీల్‌తో పాటు నటి పూర్ణ కీలక పాత్రల్లో కనిపించనున్న సినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందించనున్నారు.