నేను చనిపోతే కానీ అనురాగ్‌పై చర్యలు తీసుకోరా? : పాయల్

by Shyam |
నేను చనిపోతే కానీ అనురాగ్‌పై చర్యలు తీసుకోరా? : పాయల్
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ పాయల్ ఘోష్ పోలీసులపై ఫైర్ అయింది. అనురాగ్ కశ్యప్ తనను లైంగింకంగా వేధించాడంటూ ఆరోపణలు చేసిన నటి.. కేసు కూడా పెట్టింది. ఇందుకు సంబంధించి సాక్ష్యాధారాలు కూడా అందించానని.. కానీ పోలీసులు మాత్రం అనురాగ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడింది. నాలుగు నెలలు కావస్తున్నా కూడా కనీసం కదలిక లేదన్న పాయల్.. ప్రొసీడింగ్ జరగాలంటే తను చనిపోవాలా? అని ప్రశ్నించింది. ముంబై పోలీసులు ఈ కేసు విషయంలో ది బెస్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నానన్న పాయల్.. ఇది మహిళకు సంబంధించిన విషయమని .. ఇలాంటి వాటిలో మనం ఎలాంటి ఉదాహరణలు సెట్ చేస్తున్నామో ఆలోచించాలని కోరింది.

Advertisement

Next Story