వీహెచ్ అంటే ఎంతో ఇష్టం.. త్వరగా కోలుకోవాలి: పవన్

by Shyam |   ( Updated:2021-07-11 07:36:19.0  )
వీహెచ్ అంటే ఎంతో ఇష్టం.. త్వరగా కోలుకోవాలి: పవన్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. వీలైనంత త్వరగా ఆయన కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. వీహెచ్ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు అపోలో వర్గాలను అడిగి తెలుసుకుంటున్నానని, కోవిడ్ దృష్ట్యా నేరుగా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించలేకపోతున్నట్లు తెలిపారు.

వీహెచ్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో మళ్లీ రావాలని, రాజకీయ సేవ చేయాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు పవన్ చెప్పారు. వీహెచ్ సమస్య ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి పోరాడతారని, ఆయన చొరవ ఇతర నేతలకు స్ఫూర్తిదాయకం అని పవన్ అన్నారు.

Advertisement

Next Story