తండ్రిలానే ట్రెండ్ సెట్ చేస్తోన్న అకీరా నందన్…

by Anukaran |   ( Updated:2021-04-08 06:25:43.0  )
తండ్రిలానే ట్రెండ్ సెట్ చేస్తోన్న అకీరా నందన్…
X

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అభిమానులకు ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆయన వారసుడు అకీరా నందన్ అంటే కూడా పవన్ అభిమానుల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కంటెంట్ ఉన్నవాడికి కటౌట్ చాలు అన్న తండ్రి డైలాగ్ కి ఎగ్జాట్ గా అకీరా ఉన్నాడు. మీడియాలో అతనికి ఉన్న ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. తండ్రి పోలికలను పుణికి పుచ్చుకున్న అకీరా నేడు తన 24 వ బర్త్ డే జరుపుకుంటున్నాడు. తల్లి రేణు దేశాయ్ అకీరాకి సంబంధించిన ఓ ప్రత్యేక ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

ఈ ఫొటోలో అకీరా సాంప్రదాయమైన పంచెకట్టు, లాల్చీతో అదిరిపోయే కటౌట్ తో నిలబడి ఉన్నాడు. ఫోటో షేర్ చేయడంతోపాటు అకీరా పంచెకట్టు వెనుక ఉన్న స్టోరీని రేణు దేశాయ్ రివీల్ చేసింది. ఆ స్టోరీ ఏంటంటే… “మేము తిరుమలలో శ్రీవారి దర్శనం ముగించుకుని హోటల్ కి వచ్చాము. అప్పుడు అకీరా నన్నొక మంచి ప్రశ్న వేశాడు. ఆడవారు చీరలు కట్టుకోవడం సాధారణం అయితే… మగవాళ్ళు కూడా రెగ్యులర్ గా పంచెలు, లుంగీలు కట్టుకోవచ్చు కదా… ఏదో పండగలకి, గుళ్ళకి వెళ్ళినప్పుడు కాకుండా అని అడిగాడు. ఒకవేళ నీకు పంచెకట్టు కంఫర్ట్ గా ఉంటుంది అంటే రోజూ అదే కట్టుకో అని చెప్పాను. ఇక ఆరోజు నుండి అకీరా జీన్స్, షార్ట్స్ కంటే రెగ్యులర్ గా పంచె కట్టుకుంటున్నాడు.” అని అకీరా పంచె కట్టు స్టోరీ తెలిపింది.

మన సంప్రదాయ దుస్తులు వేసుకోవడానికి ఎవరూ ఇబ్బంది పడకూడదు. మన సంప్రదాయాలను కొనసాగించడంలో మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. ఈ విషయంలో నా కొడుకుని చూస్తుంటే నాకు గర్వంగా ఉంది… అని రేణూ చెప్పుకొచ్చింది. ఇక ఈ ఫోటోని పవన్ అభిమానులు నిమిషాల్లో షేర్ చేస్తూ అకీరాకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. తండ్రిలానే పంచె కట్టు, లాల్చీతో, అకీరా ట్రెండ్ చేస్తున్నాడంటూ పవన్ అభిమానులు ఫిదా అవుతున్నారు. ఏదిఏమైనా నూనూగు మీసాలతో పాల బుగ్గలతో మెరిసిపోతున్న అకీరా కటౌట్ అద్భుతంగా ఉందనే చెప్పాలి.

Advertisement

Next Story

Most Viewed