తమ్ముడిని పవన్ అన్నా.. బ్రదర్ అనండి

by Shyam |
తమ్ముడిని పవన్ అన్నా.. బ్రదర్ అనండి
X

తెలంగాణ రాష్ర్ట్ట మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్‌లో ఎంతో చురుకుగా ఉంటారు. ముఖ్యంగా ఆయన ఏ విషయమైన ట్విట్టర్ వేదికగా పంచుకుంటారు. అయితే జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా వైరస్ నివారణకు రూ.2కోట్ల ఆర్థిక సాయం అందించిన విషయం తెలిసిందే. అందులో రూ.50లక్షలు తెలంగాణ ప్రభుత్వానికి, రూ.50లక్షలు ఆంధ్రప్రభుత్వానికి, కేంద్రానికి రూ.1కోటి ప్రకటించారు. దీంతో కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… గ్రేట్ గెస్చర్ అన్నా అంటూ ట్వీట్ చేసాడు. దానికి పవన్ కళ్యాణ్ చూసి రిప్లై కూడా ఇచ్చాడు. మీరు, మీ నాన్నగారు కేసీఆర్ ఇలాంటి విపత్కర సమయంలో అద్భుతమైన పని చేస్తున్నారు కేటీఆర్‌ సర్ అని రీ ట్వీట్ చేశాడు. దానికి వెంటనే కేటీఆర్ వెంటనే మళ్లీ రిప్లై ఇచ్చారు. నన్ను సర్ అనకండి అన్న తమ్ముడిని.. బ్రదర్ అని పిలవండి అన్నారు. దీనికి మళ్లీ పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఓకే బ్రదర్ అని రిప్లే ఇచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ మానవత్వాన్ని చూసి అందరూ అభినందిస్తున్నారు.


Tags: Pawan Kalyan, responding, KTR, twitter, retweet, sir. brother

Advertisement

Next Story