- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే జనసేన ఊరుకోదు.. పవన్ కల్యాణ్
దిశ, ఏపీ బ్యూరో: అసెంబ్లీలో టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. చంద్రబాబు కన్నీటిపర్యంతం అవ్వడం బాదాకరమన్నారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ వైపరిత్యాలు తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయంటూ.. ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఓ పక్క వరదలు రాష్ట్రాన్ని అతాలకుతలం చేస్తుంటే, ప్రజాప్రతినిధులు ఇవేమి పట్టనట్లుగా విమర్శలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు.
తన భార్యను కించపరిచారని, ఆమె గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లేలా వైసీపీ నేతలు మాట్లాడారని ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు కంటతడి పెట్టడం బాధాకరం. ఇలాంటి ఘటనలు సామాన్యులకు రాజకీయ వ్యవస్థపై ఏహ్యభావం కలిగించే ప్రమాదం ఉంది. ఈ మధ్యకాలంలో కొందరు టీవీ, సమావేశాల్లో మాట్లాడుతున్న భాషను చూస్తుంటే సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు కుటుంబ సభ్యులపై విమర్శలు చేయడం శోచనీయం, వీటిని ఖండిస్తున్నామన్నారు.
గతంలో సీఎం జగన్ కుటుంబ సభ్యులపై కొందరు మాట్లాడితే అప్పుడు కూడా ఖండించినట్లు గుర్తు చేశారు. మహిళలను గౌరవించాలి.. వారిని కించపరిచే విధంగా మాట్లాడితే జనసేన ఊరుకోదని చెప్పుకోచ్చారు. వారిపట్ల బాధ్యాతాయుతమైన పదవుల్లో ఉన్న వారు జాగ్రత్తగా పద్దతిగా వ్యవహరించాలని పవన్ అన్నారు. రాష్ట్రంలోని ప్రతిఒక్కరు ఇలాంటి ఘటనలను ఖండించాలని, లేదంటే ఇది ఒక వ్యాధిలా వ్యాపించి అంతటా ప్రబలే ప్రమాదం ఉందన్నారు. రాజకీయ వ్యవస్థను కాపాడాలంటే ప్రజల దృష్టిలో ఇలాంటి వ్యాఖ్యలు చేసి పలుచన కావొద్దని అభిప్రాయపడుతున్నాను అంటూ ప్రకటనలో తెలిపారు