పండుగ సాయన్నకు పవన్ ‘అభయ హస్తం’

by Shyam |
పండుగ సాయన్నకు పవన్ ‘అభయ హస్తం’
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 27వ చిత్రం ‘తెలంగాణ రాబిన్‌హుడ్ పండుగ సాయన్న’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. క్రిష్ డైరెక్షన్‌లో పాన్ ఇండియా మూవీగా వస్తున్న సినిమాను ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా… బడ్జెట్ రూ. 200 కోట్లు దాటుతుందని అంచనా. అదీగాక పవన్‌కు కూడా రెమ్యునరేషన్ భారీగానే ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి నిర్మాత కాస్త సంశయంలో పడ్డాడట.

అయితే నిర్మాత పరిస్థితిని గమనించిన పవన్ రెమ్యునరేషన్ కోసం ఎలాంటి ఇబ్బంది పెట్టనని ఆయనకు హామీ ఇచ్చారట. మూవీ బిజినెస్ క్లోజ్ అయ్యాక నాన్ థియేట్రికల్ రైట్స్‌ను రెమ్యునరేషన్‌గా తీసుకుంటానని చెప్పాడట. దీంతో నిర్మాత ఏఎం రత్నం కాస్త కుదుటపడ్డారట. ఈ విషయం తెలిసిన అభిమానులు పవన్ నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అందుకే పవన్ పవర్ స్టార్ అయ్యాడంటూ అభినందిస్తున్నారు. పవర్‌స్టార్‌కు ఇది తొలి పిరియాడికల్ మూవీ కాగా … ప్రగ్యా జైశ్వాల్, దిశా పఠాని, జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు.

Advertisement

Next Story