- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కరోనాపై జనసేన పాట… అభినందించిన సేనాని
కరోనా మహమ్మారి చేతుల్లో చిక్కకుండా ఉండాలంటే చేతులు తరుచూ శుభ్రపరుచుకోవాలి అని… కరోనా కోరల్లో చిక్కుకుండా ఉండాలి అంటే కాలు బయట పెట్టకూడదని సినీ ప్రముఖులు హెచ్చరిస్తూనే ఉన్నారు. మాటలు, పాటల రూపంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఎన్నో పాటలు వచ్చాయి. ఎంతో మంది ప్రముఖులు షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ప్రజలకు సూచనలు చేశారు. మరెంతో మంది మానవత్వంతో ముందుకొచ్చి విరాళాలు అందించి … కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారందరిని కూడా పేరు పేరున అభినందించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… జనసేన పార్టీ తరపున విడుదలై ఆకట్టుకుంటున్న అవగాహన పాటపై సోషల్ మీడియాలో స్పందించారు. ఈ పాటకు పనిచేసిన ప్రతీ ఒక్కరినీ అభినందించారు.
” కరోనా పై ర్యాప్ సాంగ్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషిచేస్తున్న “గబ్బర్ సింగ్” సినిమా నటులు సాయి బాబా, రమేష్, ప్రవీణ్, రాజశేఖర్, శంకర్, శ్రీకాంత్, ఉదయ్ కుమార్, సోమరాజ్, చంద్రశేఖర్, నరసింహ రెడ్డి, సింగర్ “మేఘా రాజ్”, ఎడిటర్ “వేణు”, మ్యూజిక్ డైరెక్టర్ “శ్రీ కోటి” గీత రచయిత “ప్రియాంక” గార్లకు, మరియు ఇతర సహాయక బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అని ట్వీట్ చేశారు. “
వి ఆర్ ఇండియన్స్స్ సున్ లో… హమ్ సబ్ ఏక్ హై సంజో… అంటూ సాగే ర్యాప్ సాంగ్ లో.. స్టే హోమ్ స్టే సేఫ్ ప్రాధాన్యత గురించి చెబుతూనే…పీఎం, సీఎం చెప్పే సూచనలు ఆచరించాలని కోరారు. కష్ట కాలంలో మనల్ని కాపాడేందుకు మన ముందు నిల్చున్న డాక్టర్లు, పోలీసులు, పారిశుధ్య కార్మికులకు గౌరవం ఇవ్వాలని కోరారు. ఇక సాంగ్ ఎండింగ్ లో జై హింద్ అన్న పవన్ డైలాగ్ ఒక్కటి చాలు… పాట ట్రెండింగ్ లో నడిచేందుకు అంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్.
కరోనా పై ర్యాప్ సాంగ్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషిచేస్తున్న “గబ్బర్ సింగ్” సినిమా నటులు సాయి బాబా, రమేష్, ప్రవీణ్, రాజశేఖర్, శంకర్, శ్రీకాంత్, ఉదయ్ కుమార్, సోమరాజ్, చంద్రశేఖర్, నరసింహ రెడ్డి గార్లకు, సింగర్ “మేఘా రాజ్”, ఎడిటర్ “వేణు”
(Cont..)— Pawan Kalyan (@PawanKalyan) April 17, 2020
Tags: Pawan Kalyan, Janasena, CoronaVirus, Covid19, Corona Song