'లాయర్ సాబ్' ఫస్ట్‌సాంగ్ వచ్చేస్తోంది!

by Shyam |
లాయర్ సాబ్ ఫస్ట్‌సాంగ్ వచ్చేస్తోంది!
X

పవర్‌‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. పవన్ 26వ మూవీ ‘లాయర్ సాబ్’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు టైం ఆసన్నమైంది. ఫిబ్రవరి 29న ఉదయం 9గంటలకు సాంగ్ రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించినట్లు సమాచారం. సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న ఎస్.ఎస్.థమన్.. పవన్ ఫ్యాన్‌గా ఫస్ట్ సాంగ్ రిలీజ్ కోసం చాలా ఆత్రుతగా ఉన్నట్లు ట్వీట్ చేశాడు. ఇందుకోసం టీం మొత్తం నిర్విరామంగా కష్టపడుతుందన్నారు. ఇది మా యూనిట్‌కు ఎంత ఇంపార్టెంటో ఫ్యాన్స్‌కు కూడా అంతే ముఖ్యం అన్న థమన్… బెస్ట్ ఇచ్చేందుకు శాయాశక్తులా ప్రయత్నిస్తున్నామన్నాడు. కాగా శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న లాయర్ సాబ్ చిత్రానికి దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మాతలు.

Advertisement

Next Story