తొండంగిలో పవన్ కళ్యాణ్ దీక్ష

by srinivas |   ( Updated:2021-01-09 05:39:59.0  )
తొండంగిలో పవన్ కళ్యాణ్ దీక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్‌ కొత్తపాకలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా దివీస్ ఘటనకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ దీక్ష తలపెట్టారు. అయితే మొదట పవన్ బహిరంగ సభకు అనుమతించిన పోలీసులు అనంతరం అనుమతి నిరాకరించారు. దీంతో జనసేన తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దివిస్ లాబొరేటరీస్ కాలుష్యంతో ప్రభావితమయ్యే ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు బాసటగా నిలిచేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు భారీ మద్దతు లభిస్తోంది. జనసేన పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదికపై నాదెండ్ల మనోహర్, తూర్పు గోదావరి జిల్లా నేతలు, దివీస్ బాధితులు వేదికపై ఉన్నారు. పార్టీ స్థానిక నాయకులు మాట్లాడుతున్నారు. జనసేన మొదటి నుంచి దివీస్ సంస్థ ఏర్పాటును వ్యతిరేకించిందని తెలిపారు.

Advertisement

Next Story