- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండు కోట్లు ఇప్పుడే పంపించాను: పవన్ కల్యాణ్
కరోనాపై పోరాటానికి వివిధ వర్గాల ప్రజలు ప్రధాని సహాయ నిధితో పాటు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు విరాళాలిచ్చి సహాయపడుతున్నారు. ఈ నేపధ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఒక కోటి రూపాయల విరాళాన్ని ‘పీఎం కేర్స్ ఫండ్’కు ఆన్ లైన్ ద్వారా ట్రాన్స్ ఫర్ చేశారు. ఈ సమాచారాన్ని తెలియజేస్తూ పవన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ‘కోవిడ్-19’ పై పోరాటానికి తాను ప్రకటించిన రెండు కోట్ల రూపాయలలో భాగంగా ఈ రూ. కోటిని ’పీఎం కేర్స్ ఫండ్’కు ఇప్పుడే పంపించానంటూ కస్టమర్ అక్ నాలెడ్జ్ మెంట్ స్లిప్ ను తన పోస్ట్ లో జతపరిచారు.
As a part of my Rs. 2 crore commitment to fight against covid-19 pandemic,Rs.50 lakh been transferred to Andhra Pradesh CM Relief fund.@AndhraPradeshCM @JanaSenaParty @bolisetti_satya @UrsPMR @Sunil_Deodhar @BJP4Andhra pic.twitter.com/nAL3tc1ZAS
— Pawan Kalyan (@PawanKalyan) April 3, 2020
అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి 50 లక్షల రూపాయలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయలు పవన్ కల్యాణ్ పంపించారు. వీటికి సంబంధించిన అక్‌నాలెడ్జ్‌మెంట్ స్లిప్‌లను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. పవన్ నిబద్దతపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.
Tags : pawankalyan, one crore donation, pm cares, ap cm, ts cm, janasena