బీజేపీపై పవన్‌కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..

by Shyam |   ( Updated:2021-03-14 00:40:13.0  )
Pawan Kalyan
X

దిశ, వెబ్‌డెస్క్ : జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ తెలంగాణ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం మాతో సఖ్యతగా ఉన్నా.. తెలంగాణ బీజేపీ జనసేన పార్టీని చులకన చేసి మాట్లాడటమే కాకుండా, కుట్ర చేసిందని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ బలపరిచిన పీవీ కూతురు వాణీదేవికి తన మద్దతు ఉంటుందని పవన్ స్పష్టంచేశారు.

గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, సీనియర్ నాయకులు బుజ్జగించడంతో ఆయన వెనక్కితగ్గారు. అంతకుముందే బీజేపీ, జనసేన పొత్తుపెట్టుకోవడంతో తిరుపతి పార్లమెంటు స్థానానికి జరిగే ఉపఎన్నికలో అయినా బీజేపీ అధిష్టానం జనసేనకు సీటు కేటాయిస్తుందని అంతా భావించినా చివరకు పవన్‌కు మొండిచేయి ఇచ్చారు. దీంతో హర్ట్ అయిన పవన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేసి ఉంటారని పొలిటికల్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Next Story