బరితెగించిన పవన్ ఫ్యాన్స్.. కానిస్టేబుల్‌పై కత్తితో దాడి!

by srinivas |
Vakeel Saab
X

దిశ, వెబ్‌డెస్క్ : వకీల్ సాబ్ మూవీ వపన్ ఫ్యాన్స్‌ను బూస్టింగ్ ఇవ్వడమే కాకుండా, పలు వివాదాల్లో ఇరుక్కునేలా చేస్తోంది. నిన్న ప్రీమియర్ షో మధ్యలో ఆగిపోయిందని మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ థియేటర్‌లో ఫ్యాన్స్ గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీలోని అనంతపురం జిల్లా నార్పలలో కానిస్టేబుల్‌పై వకీల్ సాబ్ అభిమానులు కత్తితో దాడికి పాల్పడ్డారు.

శ్రీనివాస్ థియేటర్ వద్ద సినిమా విషయంలో యువకుల మధ్య ఘర్షణ నెలకొంది. వారిని అదుపు చేసేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌పై ఫ్యాన్స్ కత్తితో దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన కానిస్టేబుల్‌ను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story