తెలుగు రాష్ట్రాలకు జనసేనాని కోటి విరాళం

by srinivas |   ( Updated:2020-03-26 00:01:53.0  )
తెలుగు రాష్ట్రాలకు జనసేనాని కోటి విరాళం
X

కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటుంది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తోంది. ఎంత ఖర్చు అయినా భరిస్తాం మీరు మాత్రం ఇంటి నుంచి బయిటకు రావొద్దని కోరుతుంది. ఈ క్రమంలోనే పలువురు సినీ తారలు అవగాహన కల్పిస్తూ తమకు తోచిన సాయం చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన వంతు సహాయం అందిస్తున్నట్లు ప్రకటించాడు. ఏపి, తెలంగాణ రాష్ట్రాలకు రూ. 50 లక్షల చొప్పున విరాళాన్ని అందిస్తున్నట్లు ప్రకటించాడు జనసేనాని. ఇంత పెద్ద మొత్తంలో విరాళం ప్రకటించడం పై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నీ అభిమానిగా ఉన్నందుకు గర్వపడుతున్నాము అని ట్వీట్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ప్రకృతి విపత్తులు సంభవించినా… నాకెందుకులే అనుకోకుండా .. ప్రతి ఒక్కరూ బాగుండాలని మంచి మనసుతో సాయం అందించడం నీకు మాత్రమే చెల్లుతుంది జనసేనాని అంటూ కొనియాడుతున్నారు.


Tags: pawan kalyan, janasena, donations, cmdrf, telugu states, ap, telangana, pavan 50 lakhs rupees donation

Advertisement

Next Story