పవర్‌ స్టార్ కూతురా మజాకా.. ఆద్య వీడియో వైరల్

by Shyam |   ( Updated:2023-03-30 17:27:53.0  )
pawan kalyan
X

దిశ, సినిమా: రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‏గా ఉంటుంది. ఆద్య, అకీరా నందన్‌ సరదాగా చేసే అల్లరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. దీంతో తను షేర్ చేసే ప్రతీ అప్‌డేట్ క్షణాల్లో నెట్టింట్లో వైరల్ అవుతుంది. తాజాగా తన కూతురు ఆద్యకు సంబంధించిన వీడియోను షేర్ చేయగా.. ఇందులో ఆద్య గిటార్ వాయిస్తూ పాట పాడుతూ కనిపిస్తోంది. దీంతో పవర్ స్టార్ కూతురి టాలెంట్ చూసిన మెగా అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

ఆద్య టాలెంట్‌కు ఫిదా అవుతున్న నెటిజన్స్..‘పవర్ స్టార్ ఎనర్జీ, టాలెంట్‌కు కేరాఫ్ అడ్రస్ కాగా ఆయన రక్తం పంచుకుపుట్టిన బిడ్డ కూడా అదే పవర్‌తో ఉంటుంది. పవర్‌ స్టార్ కూతురా మజకా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు అకీరా నందన్‌కు కూడా మ్యూజిక్ ప్లే చేయడం అంటే ఇష్టమని ఇప్పటికే తెలిసిన విషయమే.

నా కోరిక తీర్చేదెవరో అంటున్న ‘రొమాంటిక్’ బ్యూటీ కేతిక శర్మ..

Advertisement

Next Story