- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాంబ్ పేల్చిన వర్మ.. ఆ ఫొటోతో పవన్ కళ్యాణ్‌కి విషెస్
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్‌లో రామ్ గోపాల్ వర్మ విభిన్నమైన దర్శకులలో ఒకరు. రామ్ గోపాల్ వర్మ ఒకానొక సమయంలో సాధారణ హీరోలను స్టార్ హీరోలుగా మార్చేశాడు. ఇక అంతే కాకుండా అప్పట్లో మాస్ సినిమాలకు రామ్ గోపాల్ వర్మ పెట్టింది పేరు . వివాదాల్లో కూడా ఆయన ముందుంటారు. ఎప్పుడు ఎవరో ఒకరిపై కామెంట్స్ వేస్తూ ఉంటారు. ఇక పవన్ కళ్యాణ్ పై ఆర్జీవీ ఎప్పుడూ ఏదో ఒక అంశంతో సెటైర్లు వేస్తారన్న సంగతి తెలిసిందే. అయితే ఈరోజు పవన్ బర్త్ డే కి వర్మ విషెస్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అందులోనూ పవన్ వీరాభిమాని అషురెడ్డి టాటూ ఫోటోను పోస్ట్ చేసి విషెస్ చెప్పడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Read more: స్నేహం ముసుగులో కమిట్‌మెంట్.. హీరోయిన్స్‌తో వారి వెకిలి చేష్టలు
మొన్న ఆ మధ్య అషు రెడ్డి వర్మను ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఇంటర్వ్యూలో అషు ని వింత యాంగిల్‌లో ఫొటో తీసి రచ్చ చేశాడు. ఈ నేపథ్యంలోనే ఆర్జీవీ సోషల్ మీడియాలో అష్షు సీక్రెట్ ప్లేస్‌లో వేసుకున్న టాటూ ఫోటో షేర్ చేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘పవన్ కళ్యాణ్ అభిమానుల తరఫున ఆయనను అభిమానించే అషురెడ్డి తరఫున పవన్ కళ్యాణ్ కు అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే’ అష్షు నాతో చేసిన ఇంటర్వ్యూ ప్రోమో సెప్టెంబర్ 2న సాయంత్రం 6 గంటలకు విడుదల అవుతుంది. జై పవన్ కళ్యాణ్..జై అషు రెడ్డి..” అంటూ వర్మ పోస్ట్ లో పేర్కొన్నారు. అయితే ఇది వర్మ సెటైరా..? లేక ఆ ఇంటర్వ్యూని ప్రమోట్ చేస్తున్నాడా..? అనేది మాత్రం నెటిజన్లకు అంతుచిక్కడం లేదు. ఏదిఏమైనా ఈ వివాదస్పద దర్శకుడు ఏం మాట్లాడినా వైరలే కాబట్టి ఈ ట్వీట్ కూడా నెట్టింట వైరల్‌గా మారింది.
https://twitter.com/RGVzoomin/status/1433124367810973702?s=20