మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌పై పవన్ ఫ్యాన్స్ ట్రోల్స్

by Jakkula Samataha |
మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌పై పవన్ ఫ్యాన్స్ ట్రోల్స్
X

దిశ, సినిమా : ‘అలవైకుంఠపురములో’ మూవీ సాంగ్స్‌తో మ్యూజికల్ సెన్సేషన్‌గా మారిన ఎస్.ఎస్. థమన్, టాలీవుడ్‌లో ప్రస్తుతం లీడింగ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. ఇదే ఊపులో కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ బడా ప్రాజెక్టులు లైన్‌లో పెట్టాడు. ఈ క్రమంలో అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్‌కు, తమ్ముడు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ‘పింక్’ రీమేక్ ‘వకీల్‌సాబ్’కు కూడా థమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక శనివారం వకీల్ సాబ్ మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన ‘మ్యూజిక్ ఫెస్ట్’లో పాల్గొన్న థమన్.. పవన్‌తో సినిమా చేయడం తన డ్రీమ్ అని చెప్పారు. అయితే ట్విట్టర్ వేదికగా థమన్ చేసిన ఓ ట్వీట్ పవన్ ఫ్యాన్స్‌కు ఆగ్రహం తెప్పించింది.

https://twitter.com/MusicThaman/status/1373197504485847042?s=20

ఏప్రిల్ 9న రిలీజ్ అవుతున్న ‘వకీల్ సాబ్’తో పాటు అదే నెల 1న వస్తున్న కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన ‘యువరత్న’ చిత్రానికి కూడా థమన్ మ్యూజిక్ అందించాడు. అయితే సినిమా ప్రమోషన్‌లో భాగంగా ‘యువరత్న’ ట్రైలర్ షేర్ చేసిన థమన్.. పవర్‌స్టార్ గ్రాండ్ విక్టరీ అని ట్వీట్ చేయగా, దాన్ని పవన్ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. ‘పవర్ స్టార్ అంటారు.. వేరే పేరు చెబుతారు!’ అని ఒకరు అసహనం వ్యక్తం చేయగా, మరొకరు ‘మ్యూజికల్ ఫెస్ట్ గురించి చెప్పండి ఫస్ట్’ అని కామెంట్లు చేశారు. పవన్ ‘వకీల్‌సాబ్’ గురించి మాత్రమే చెప్పాలని థమన్‌పై నెగెటివ్ పోస్టులు పెట్టారు. కాగా ‘వకీల్‌సాబ్’ నుంచి ఇప్పటికే రిలీజైన ‘మగువా మగువా, సత్యమేవ జయతే, కంటిపాప’ సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచేయగా, ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Advertisement

Next Story