‘పోసాని’కి పవన్ ఫ్యాన్స్ హెచ్చరిక.. కరీంనగర్‌లో కేసు ఫైల్

by Sridhar Babu |   ( Updated:2021-09-30 04:03:05.0  )
Posani Krishna Murali
X

దిశ, కరీంనగర్ సిటీ : ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి పై పవన్ కళ్యాణ్ అభిమానులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ అభిమాన కథానాయకుడిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ, విచక్షణరహితంగా మాట్లాడుతున్నాడని వెంటనే అతన్ని అరెస్టు చేయాలని ఒకటో పట్టణ సీఐ నటేష్ ను కోరారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానుల సంఘం నాయకులు మాట్లాడుతూ.. నటుడు పోసాని కృష్ణమురళి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పవన్ కుటుంబాన్ని విమర్శించిన పోసాని లాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని, ఇకపై తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ పై ఎవరైనా నోరు జారితే ఊరుకోమని హెచ్చరించారు. కార్యక్రమంలో పవన్ ఫాన్స్ నాయకులు అజయ్, బబ్లు గౌడ్, సాయి ధరమ్ తేజ్ రాష్ట్ర యువత అధ్యక్షుడు కాస రాజు, కందుల రాజిరెడ్డి, రాష్ట్రప్రధాన కార్యదర్శి పులి రాకేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story