వైఎస్సార్సీపీ రౌడీయిజానికి బుద్ధి చెప్పండి: పవన్ కల్యాణ్

by srinivas |
వైఎస్సార్సీపీ రౌడీయిజానికి బుద్ధి చెప్పండి: పవన్ కల్యాణ్
X

వైఎస్సార్సీపీ రౌడీయిజానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని జనసేనాని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. విజయవాడలో బీజేపీతో కలిసి విజన్ డాక్యమెంట్ విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ–జనసేన కలిసి పోటీ చేస్తున్నాయని అన్నారు. నామినేషన్లు వేస్తుంటేనే ఇంత హింస చెలరేగుతుంటే, ఓట్లు వేయడానికి ఇక ఎవరు ముందుకు వస్తారు? అని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి స్థానిక ఎన్నికలను ఏకగ్రీవం చేసుకోవాలని అధికారపార్టీ అరాచకాలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు.

దీనికి ఎలక్షన్ కమిషన్ బాధ్యత తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. 2014, 2019లో టీడీపీ ఎన్నికలు నిర్వహించకుండా, జన్మభూమి కమిటీల పేరుతో మోసం చేసిందని ఆయన విమర్శించారు. ఇప్పుడు అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ అరాచకాలతో విజయం సాధించాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, వైఎస్సార్సీపీలకు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని విమర్శించారు. ఏపీలో ‘క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్’ ని జనసేన, బీజేపీలు సంపూర్ణంగా నిరసిస్తున్నాయని ఆయన తెలిపారు.

స్థానిక ఎన్నికల్లో యువతకు, కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో తాము ముందుకు వెళ్తుంటే, నామినేషన్లు కూడా వేయనీయకుండా అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. చిత్తూరు జిల్లాలో విపక్షాల అభ్యర్థులు నామినేషన్ వేయాలంటే భయపడే పరిస్థితి కల్పించారని మండిపడ్డారు. ఓడిపోతామని భయపడుతున్నప్పుడు దౌర్జన్యంగా ఎన్నికలు నిర్వహించడం ఎందుకు? అని ఆయన వైఎస్సార్సీపీని నిలదీశారు.

Tags: janasena, bjp, ysrcp, tdp, pawan kalyan, kanna lakshminarayana, vision document

Advertisement

Next Story

Most Viewed