బాధితులపైనే ఎదురు కేసులా ?: పవన్

by srinivas |   ( Updated:2020-11-22 10:24:41.0  )
బాధితులపైనే ఎదురు కేసులా ?: పవన్
X

దిశ, ఏపీ బ్యూరో: ప్రశ్నించిన వారిపై ఎదురు కేసులు పెట్టడమేంటని జనసేన అధ్యక్షుడు పవన్​ కల్యాణ్ ​ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీకాళహస్తి జనసేన ఇన్‌చార్జ్ వినుత కోటా ఇంటిపై దాడి చేయడం అమానుషమన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనిపిస్తోందని, అధికార పక్షం అరాచకాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘోరాలను జనసేన పార్టీ ఖండిస్తోందన్నారు.

Advertisement

Next Story