మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఆసుప‌త్రిలో ఆమె ఏమైంది?

by Sumithra |   ( Updated:2020-11-27 04:13:16.0  )
మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఆసుప‌త్రిలో ఆమె ఏమైంది?
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన రోగి కనిపించకుండా పోయింది. విషయాన్ని వైద్య సిబ్బంది దృష్టికి తీసుకెళితే వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం దారుణం. పూర్తి వివరాళ్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా చౌదర్ గూడ మండలంలోని జాకారం గ్రామానికి చెందిన అంజిలమ్మ(65) అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో బంధువులు ఆమెను మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు.

అయితే, రెండు రోజులుగా చికిత్స పొందుతున్న వృద్దురాలు ఒక్కసారిగా ఆసుపత్రి నుండి మాయమైంది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి రోగి ఆసుపత్రిలో కనిపించకపోవడంతో ఆమె కూతురు వైద్య సిబ్బందిని సంప్రదించి ఆరా తీసింది. దీనిపై ఆగ్రహించిన వైద్య సిబ్బంది కోపంతో మేం కావలి ఉంటామా? ఎక్కడికి వెళ్ళిందో బయటికి వెళ్లి వెతుక్కోవాలని ఉచిత సలహాలు, సూచనలు చేశారు. అయితే, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన తల్లి కనిపించకుండా పోయిందని బాధిత మహిళ ఆరోపిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed