SU ఫార్మసీ బృందం ముందడుగు.. మధుమేహ చికిత్స పరిశోధనకు పేటెంట్

by Sridhar Babu |
SU ఫార్మసీ బృందం ముందడుగు.. మధుమేహ చికిత్స పరిశోధనకు పేటెంట్
X

దిశ, కరీంనగర్ సిటీ: పరిశోధనా రంగంలో శాతవాహన విశ్వవిద్యాలయం ఫార్మసీ బృందం ముందడుగు వేసింది. మధుమేహ వ్యాధిలో ఉపయోగించే ఔషధాలను గుర్తించడంలో సులువైన పద్ధతిని అభివృద్ధి చేసినందుకు ఎస్ యూ ఫార్మసీ అధ్యాపకుడు పి. క్రాంతి రాజు బృందానికి పేటెంట్ లభించింది. ‘ఎ మెథడ్ ఫర్ స్క్రీనింగ్ ఆఫ్ ఆంటీ డయాబెటిక్ డ్రగ్స్ యూజింగ్ చిక్ ఎంబ్రియో’ అనే అంశంపై చేసిన పరిశోధనకు చెన్నైలోని ఇండియన్ పేటెంట్ ఆఫీస్ ఈ పేటెంట్ హక్కులు మంజూరు చేసింది. ఈ విధానం ద్వారా మధుమేహ వ్యాధికి ఉపయోగపడే ఔషధాలను గుర్తించడం సులువు అవుతుందని, పరిశోధనలో జంతువుల వాడకం గణనీయంగా తగ్గించవచ్చని క్రాంతి రాజు తెలిపారు.

దీని ద్వారా పరిశోధనకు అయ్యే ఖర్చును కూడా తగ్గించవచ్చని, చిక్ ఎంబ్రియోను ఉపయోగించి మధుమేహంపై పరిశోధన చేయడం ప్రపంచంలోనే ప్రప్రథమం అని క్రాంతి రాజు తెలిపారు. పేటెంట్ సాధించిన అధ్యాపకుడిని విశ్వవిద్యాలయ విసి ఆచార్య ఎస్. మల్లేశ్ అభినందించారు. ఇటువంటి పరిశోధనలకు విశ్వవిద్యాలయం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య టి. భరత్, ప్రిన్సిపల్ డా. కె. తిరుపతి, సహాయ రిజిస్ట్రార్ వై. కిషోర్, డా. కె. శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed