ఏమాత్రం బాధ్యత లేకుండా.. నగరం నడిబొడ్డున బైక్ రేసింగ్

by Sumithra |
bike racing, night
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మరీ దారుణంగా పాజిటివ్ కేసులతో పాటు, మరణాల సంఖ్య కూడా భయంకరంగా పెరుగుతున్నాయి. అయితే.. ఓ పక్క కేసులు పెరుతున్నాయని ప్రజలు భయబ్రాంతులకు గురవుతుంటే.. మరోపక్క ఏమాత్రం బాధ్యత లేకుండా నగర యువత ప్రవర్తిస్తున్నారు. వైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్ నగరం నడిబొడ్డున బైక్ రేసింగ్‌లతో పాతబస్తీ యువకులు హల్‌చల్ చేస్తు్న్నారు. రద్దీ రోడ్లపై రేసింగ్‌లకు పాల్పడుతూ జనాలను మరింత భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. చంచల్‌గూడ జైలు రోడ్డులో పట్టపగలు బైక్ స్టంట్‌లు చేస్తూ.. వీరంగం సృష్టిస్తున్నారు. అధికవేగంతో చక్కర్లు కొట్టడమే కాకుండా కనీసం మాస్కు కూడా ధరించకుండా పూర్తి నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా తయారయ్యారు. కరోనాతో ట్రాఫిక్ తగ్గడంతో జోరుగా ఈ బైక్ రేసింగ్‌లకు పాల్పడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed