- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్‌గా ‘పాట్ కమిన్స్’..
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్‌గా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్, వైస్ కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్‌లను నియమిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకున్నది. కీలకమైన యాషెస్ సిరీస్‌కు ముందు టెస్టు జట్టు కెప్టెన్ టిమ్ పైన్ ఒక సెక్స్ స్కాండల్‌లో ఇరుక్కొని రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి జట్టు కెప్టెన్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తీవ్ర కసరత్తు చేసింది. క్రికెట్ ఆస్ట్రేలియా సెలెక్టర్లు, బోర్డు సభ్యులతో కూడిన ప్యానెల్ శుక్రవారం పాట్ కమిన్స్, స్టీవ్ స్మిత్‌ను సుదీర్ఘంగా ఇంటర్వ్యూ చేసింది. వారిద్దరి సమాధానాలతో సంతృప్తి వ్యక్తం చేసిన సభ్యులు కమిన్స్‌ను కెప్టెన్‌గా, స్మిత్‌ను వైస్ కెప్టెన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు కమిన్స్ 47వ కెప్టెన్ కాగా.. ఒక ఫాస్ట్ బౌలర్ కెప్టెన్ కావడం 1957 తర్వాత
ఇదే మొదటి సారి. 1957లో పేసర్ రే లిండ్‌వాల్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ తర్వాత ఎన్నడూ ఫాస్ట్ బౌలర్ ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌గా లేడు. 65 ఏళ్ల తర్వాత కమిన్స్ ఈ రికార్డు బ్రేక్ చేశాడు. 2018లో బాల్ టాంపరింగ్ వివాదంలో స్మిత్ కెప్టెన్సీని కోల్పోయాడు. మూడేళ్ల తర్వాత స్మిత్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించడం గమనార్హం. పాట్ కమిన్స్ ఇప్పటి వరకు 34 టెస్టుల్లో 164 వికెట్లు పడగొట్టారు. అతడి ఖాతాలో 5 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన, ఒక సారి 10 వికెట్ల ప్రదర్శన ఉన్నది. 6/23 అతడి అత్యుత్తమ ప్రదర్శన. ఇక స్టీవ్ స్మిత్ ఇప్పటి వరకు 77 మ్యాచ్‌లలో 7540 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతడి అత్యధిక పరుగులు 239.