గత ప్రభుత్వాలు విఫలం: సబితా

by Shyam |
గత ప్రభుత్వాలు విఫలం: సబితా
X

దిశ, రంగారెడ్డి: గత ప్రభుత్వాలు హామీలు ఇవ్వడమే కానీ అమలు చేయడంలో విఫలమయ్యాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. మహేశ్వరం మండలంలోని గట్టుపల్లి, దుబ్బచెర్ల, మాణిక్యమ్మగూడ గ్రామాల్లో మంత్రి సోమవారం సీసీ రోడ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ.. రాష్ట్రం ప్రగతి పథంలో నడవాలంటే పట్టణాలు, పల్లెలు అభివృద్ధి చెందినప్పుడే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనితా రెడ్డి, మహేశ్వరం ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునీత పాల్గొన్నారు.

Advertisement

Next Story