- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేర పరిశోధనలో జాగిలాలు కీలకం: డీజీపీ
దిశ, క్రైమ్ బ్యూరో : మొయినాబాద్‌లోని ఐఐటీఏ కెనైన్ ట్రైనింగ్ కేంద్రాన్ని దేశంలో అత్యుత్తమ శిక్షణా కేంద్రంగా తీర్చి దిద్దేందుకు ప్రత్యేకంగా రోడ్ మ్యాప్‌ను రూపొందించనున్నట్టు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. మొయినాబాద్ ఐఐటిఏ కెనైన్ ట్రైనింగ్ కేంద్రంలో 50 పోలీస్ జాగిలాలు, 80 మంది జాగిలాల శిక్షకుల పాసింగ్ అవుట్ పరేడ్ మంగళవారం ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఉగ్రవాదం, తీవ్రవాద నిర్మూలన, నేర పరిశోధన, శాంతి భద్రతల పరిరక్షణ, ప్రముఖుల వ్యక్తిగత భద్రతలో పోలీస్ జాగిలాల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. అత్యంత సంక్లిష్టమైన కేసుల ఛేదనలో పోలీస్ జాగిలాల పాత్ర అమోఘమని ప్రశంసించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నత స్థాయి పదవుల్లో ఉన్న ప్రముఖుల వ్యక్తిగత భద్రత ప్రమాదంలో పడుతున్న పరిస్థితుల్లోనూ పోలీస్ జాగిలాలు పాత్ర కీలకంగా ఉంటుందని కొనియాడారు.