భారత్‌లో పెరిగిన ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు

by Harish |
భారత్‌లో పెరిగిన ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఏడాది కొవిడ్ మహమ్మారి సెకెండ్ వేవ్ నేపథ్యంలో దేశీయంగా అనేక ప్రాంతాల్లో ఆంక్షల సడలింపుతో జూలైలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 2,64,442 యూనిట్లను చేరుకున్నాయి. తక్కువ బేస్ ఎఫెక్ట్ కూడా మరో కారణమని పరిశ్రమల సంస్థ ‘సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మ్యానుఫాక్చరర్స్‌ (సియామ్‌)’ వెల్లడించింది. సియామ్ తాజా గణాంకాల ప్రకారం.. దేశీయ మార్కెట్‌లో గతేడాది మొత్తం 1,82,779 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడవగా, ఈ ఏడాది 45 శాతం పెరిగాయి. ఈ డేటాలో టాటా మోటార్స్‌కు చెందిన అమ్మకాల వివరాలు లేవని సియామ్ తెలిపింది. అలాగే, ద్విచక్ర వాహనాలకు సంబంధించి గతేడాది ఇదే సమయంలో మొత్తం 12,81,354 యూనిట్లతో పోలిస్తే గత నెల్లో 2 శాతం తగ్గి 12,53,937 యూనిట్లకు తగ్గాయి. ఇక, స్కూటర్లు 9.6 శాతం పెరిగి 3,66,292 యూనిట్లకు చేరుకున్నాయని, మోటార్‌సైకిళ్లు 5.8 శాతం క్షీణించి 8,37,096 యూనిట్లుగా నమోదయ్యాయి. సమీక్షించిన నెలలో త్రిచక్ర వాహనాలు 17,888 యూనిట్లు అమ్ముడైనట్టు సియామ్ వెల్లడించింది.

Advertisement

Next Story