- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జనవరిలో తగ్గిన ప్యాసింజర్ వాహనాల ఉత్పత్తి
దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది జనవరిలో ప్యాసింజర్ వాహనాల ఉత్పత్తి 11.14 శాతం పెరిగి 2,76,554 యూనిట్లకు చేరుకున్నాయని, గతేడాది ఇదే నెలలో 2,48,840 యూనిట్ల ఉత్పత్తి జరిగినట్టు పరిశ్రమల సంఘం సియామ్ తెలిపింది. ‘ఉక్కు ధరలు పెరగడం, సెమీ కండక్టర్ల కొరత, అధిక కంటైనర్ ఛార్జీలు సహా సరఫరాలోని సవాళ్లు పరిశ్రమ సజావుగా పనిచేసేందుకు అడ్డంకులుగా మారాయని’ సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ స్పష్టం చేశారు. మొత్తంగా ప్యాసింజర్ వాహనాలు, త్రీ-వీలర్, టూ-వీలర్ వాహనాల మొత్తం ఉత్పత్తి జనవరిలో 7.67 శాతం పెరిగి 22,06,261 యూనిట్లకు చేరుకున్నాయి.
గతేడాదితో పోలిస్తే స్వల్పంగానే పెరిగాయని, దారుణంగా దెబ్బతిన్న ఈ రంగం ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదని సియామ్ తెలిపింది. జనవరిలో త్రీ-వీలర్ వాహనాల ఉత్పత్తి 56.76 క్షీణించాయి. టూ-వీలర్ వాహనాల ఉత్పత్తి 6.63 శాతం పెరిగాయి. పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం వాహనాల ఉత్పత్తి 21.94 శాతం పడిపోయి 1, 73,19,688 యూనిట్లకు చేరుకుంది. ఉత్పత్తి క్షీణతలో అధిక భాగం త్రీ-వీలర్ వాహనాలు 72.38 శాతం, టూ-వీలర్ 20.05 శాతం, ప్యాసింజర్ వాహనాలు 13.2 శాతంగా ఉన్నాయి. ట్రాక్టర్లు మినహా అన్ని ప్రధాన విభాగాల రిటైల్ అమ్మకాలు 10 శాతం క్షీణిచినట్టు ఈ వారంలోనే ఎఫ్ఏడీఏ గణాంకాలు తెలిపాయి.