ఈటలకు శుభాకాంక్షలు తెలిపిన పశుపతి

by Sridhar Babu |   ( Updated:2021-11-03 02:58:19.0  )
Etela-1
X

దిశ, వనస్థలిపురం: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఈటల రాజేందర్ కు నేషనల్ ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు తాడిశెట్టి పశుపతి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్కంఠ భరిత వాతావరణంలో గెలిచిన ఆయనను హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ రూ. వందల కోట్లు కుమ్మరించినా ప్రజలు ఆత్మగౌరవానికే పట్టం కట్టారని కొనియాడారు. ఈటల గెలుపునకు కృషి చేసిన బీజేపీ కార్యకర్తలు, నాయకులు, నేతలకు, ఓటరు మహాశయులకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story