సోనియా, రాహుల్ గాంధీలే కాంగ్రెస్‌కు బలం

by Anukaran |   ( Updated:2020-08-24 07:48:50.0  )
సోనియా, రాహుల్ గాంధీలే కాంగ్రెస్‌కు బలం
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు గాంధీ కుటుంబానికే అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి సమయంలో సోనియా గాంధీకి పార్టీ సీనియర్లు లేఖ రాయడంపై ఆయన మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలకు సోనియా, రాహుల్ గాంధీలే బలమన్నారు.

కొంత మంది సీనియర్ నేతలు పార్టీని చీల్చే ప్రయత్నం చేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. సోనియా, రాహుల్ దయతో పార్టీలో ఎదిగిన సీనియర్ నేతలు ఇప్పుడు నాయకత్వాన్ని మార్చాలని లేఖ రాయడం సమర్థనీయం కాదన్నారు. కాగా, పార్టీ నాయకత్వ మార్పుపై నేతలు రాసిన లేఖపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీతో కుమ్మక్కయారని పార్టీ నేతలను ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed