వేములవాడలో లాక్‌డౌన్.. ఎప్పటివరకంటే ?

by Sridhar Babu |
వేములవాడలో లాక్‌డౌన్.. ఎప్పటివరకంటే ?
X

దిశ, వేములవాడ: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వేములవాడ మున్సిపల్ పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 22 నుంచి మే 1 వరకు పాక్షికంగా లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఛైర్పర్సన్ రామతీర్థం మాధవి ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, వర్తక వ్యాపారులు, చిరు వ్యాపారులతో బుధవారం పాలకవర్గం సమావేశం అయింది. ఈ సమావేశం లో పలువురు ఇచ్చిన సూచనల మేర పాలక వర్గం పాక్షికంగా లాక్డౌన్అమలు చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. సాయంత్రం 5 గంటల నుంచి లాక్ డౌన్ అమలుకు కానుంది. సాయంత్రం 5 గంటల లోపు అన్ని దుకాణాలు బంద్ చేయాలని సూచించారు. మెడికల్, ఆసుపత్రులకు మినహాయింపు ఇచ్చారు. ఈ నెల 22 నుండి మే 1 వరకు 10 రోజుల పాటు పాక్షిక లాక్ డౌన్ అమలుకు నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 2 వేల నుండి రూ.5 వేల వరకు జరిమానా విధిస్తామని , ప్రజల రక్షణ కోసమే ఈ నిర్ణయం అని పాలక వర్గం వెల్లడించింది. ప్రజలు, వర్తక, వాణిజ్య వ్యాపారులు సహకరించాలని వారు కోరారు.

Advertisement

Next Story