- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్ర అటవీ శాఖ పనులపై అధ్యయనం
దిశ,తెలంగాణ బ్యూరో: పచ్చదనం పెంపు, అడవుల పునరుజ్జీవనం, ప్రత్యామ్నాయ అటవీకరణ పనుల్లో తనదైన ముద్ర వేసిన తెలంగాణ రాష్ట్రంలో పర్యటించి అధ్యయనం చేయాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నిర్ణయించినట్లు పీసీసీఎఫ్ ఆర్ శోభ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి బుధవారం సమాచారం అందినట్లు శోభ పేర్కొన్నారు. సీనియర్ పార్లమెంట్ సభ్యులు జై రామ్ రమేశ్ నేతృత్వంలో సుమారు 25 మంది ఎం.పీలు, ఉన్నతాధికారుల బృందం ఏప్రిల్ నెలలో ఐదురోజుల పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు వివరించారు.
ఈ సందర్భంగా అరణ్య భవన్ నుంచి అన్ని జిల్లాల అటవీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో అడవుల్లో వేసవి సమస్యలు, అగ్ని ప్రమాదాల నివారణ, జంతువులకు నీటి లభ్యత, కంపా నిధుల ద్వారా చేపట్టిన పనుల పురోగతి, వచ్చే సీజన్ హరితహారం ఏర్పాట్లు, అటవీ అనుమతులు తదితర విషయాలపై చర్చించారు. జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాన్ని గుర్తించి అటవీ నేరాల అదుపు,ఆక్రమణలు, జంతువేట, అగ్ని ప్రమాదాల నివారణ తదితర అంశాలపై అక్కడి ప్రజలకు చైతన్యం చేయాలని అధికారులను పీసీసీఎఫ్ ఆదేశించారు.
అటవీ జంతువులపై దాడులు, ఇతర కేసుల్లో సంక్లిష్టతలను చేధించేందుకు, కేసుల విచారణ వేగవంతం చేసేందుకు కచ్చితమైన నమూనాల సేకరణ కోసం సీసీఎంబీ ద్వారా మార్చి 18,19 న శిక్షణా కార్యక్రమం ఉంటుదని తెలిపారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, మన్ననూరులో ఈ శిక్షణ ఉంటుందన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ)ఆర్.ఎం. దోబ్రియల్, పీసీసీఎఫ్ (అడ్మిన్) స్వర్గం శీనివాస్, అదనపు పీసీసీఎఫ్ లు, సర్కిల్ ఇంఛార్జ్ లు, అన్ని జిల్లాల అటవీ అధికారులు పాల్గొన్నారు.