- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
దేశం సైనికుల వెంటే ఉంది : మోదీ
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలోనూ విధి నిర్వహణకు సిద్ధంగా ఉన్న పార్లమెంట్ సభ్యులందరికీ ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. వారాంతంలో కూడా పార్లమెంట్ సమావేశాలకు హాజరవడానికి అంగీకరించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. సోమవారం వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. కరోనా ఉన్నప్పటికీ విధి నిర్వహణకే సభ్యులు ప్రాధాన్యత ఇచ్చారని మోదీ పేర్కొన్నారు.
ప్రత్యేక పరిస్థితుల్లో ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ ఎంపీలందరూ విధులు నిర్వహించడానికి ముందుకొచ్చారు. దేశ ప్రజలు, పార్లమెంట్ మొత్తం దేశ సైనికులతోనే ఉందన్న సందేశాన్ని ఈ వర్షాకాల సమావేశాలు ఇస్తాయని మోదీ ఆకాంక్షించారు. ధైర్య సాహసాలతో సైనికులు మాతృభూమిని కాపాడేందుకు సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. మనందరం ఆ సైనికులకు మద్దతుగా నిలుస్తామన్న సందేశాన్ని పార్లమెంట్ సభ్యులు ఇవ్వాలన్నారు. కొవిడ్-19 వైరస్‌కు వ్యాక్సిన్ వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం వద్దని మోదీ మరోసారి స్పష్టత ఇచ్చారు.