రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ సింగ్

by  |
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ సింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్డీయే అభ్యర్థి హరివంశ్‌సింగ్ ఎన్నికయ్యారు. జేడీయూ సభ్యుడు హరివంశ్‌సింగ్‌ను జేపీ నడ్డా ప్రతిపాదించగా థావర్ చంద్ సమర్థించారు. వాయిస్ ఓటు ద్వారా ఎన్నిక నిర్వహించగా హరివంశ్‌‌సింగ్ ఎన్నికైనట్లు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. విపక్షాల తరపున పోటీ చేసిన ఆర్జేడీ సభ్యుడు మనోజ్ ఝాపై హరివంశ్‌సింగ్ విజయం సాధించారు. హరివంశ్‌సింగ్‌.. అట్టడుగు వర్గం నుంచి వచ్చిన గొప్ప మేధావి అని ప్రధాని మోడీ కొనియాడారు. అటు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక ఓటింగ్‌కు టీఆర్ఎస్ దూరంగా ఉంది. ఇవాళ రాజ్యసభ సభ్యులుగా కేకే, సురేశ్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఎంపీలందరికీ కరోనా పరీక్షలు చేయగా 17మందికి పాజిటివ్‌గా తేలింది. 12మంది బీజేపీ సభ్యులు కాగా ఇద్దరు వైసీపీ, డీఎంకే, శివసేన, ఆర్ఎల్పీకి చెందిన ఒక్కో ఎంపీకి కరోనా పాజిటివ్‌గా తేలడంతో హోం క్వారంటైన్‌కు వెళ్లిపోయారు.

Read Also…

కరోనాతో కాంగ్రెస్ కీలక నేత మృతి



Next Story