- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్రాన్స్‌ని గడగడలాడిస్తున్న నల్లి
దిశ, వెబ్‌డెస్క్ :
చూడటానికి చిన్న కీటకమే.. కానీ చాలా ఇబ్బంది పెడుతుంది. అలాగని రోగాలను వ్యాప్తి చేస్తుందా అంటే అది కూడా లేదు. ఎలాంటి రోగాలను అంటించకుండా ఒక దేశాన్ని మొత్తం ఈ కీటకం ఇబ్బంది పెడుతోంది. ఆ కీటకమే నల్లి. అవును.. ఇంగ్లీషులో పేరుకు తగ్గట్టు బెడ్ బగ్ అని పిలిచే ఈ నల్లి కారణంగా ఇప్పుడు ఫ్రాన్స్‌లో అత్యవసర సేవల నెంబర్ కూడా ఏర్పాటు చేయాల్సి వచ్చింది.
గురువారం రోజున పారిస్ ప్రభుత్వం ఓ ప్రచార కార్యక్రమం నిర్వహించి, నల్లుల బెడద ఉన్నవాళ్లు కాల్ చేయడానికి ఒక అత్యవసర నెంబరును ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేసింది. అక్కడి హోటళ్లు, అపార్టుమెంట్లు, ఇళ్లలో నల్లుల బెడద తీవ్రంగా పెరిగిపోవడంతో ఆ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 1950కి ముందు ఫ్రాన్స్‌లో నల్లుల సమస్య ఉండేది. తర్వాత కొన్ని దశాబ్దాల పాటు కనిపించకుండా పోయిన నల్లులు మళ్లీ ఇప్పుడు పెద్ద సంఖ్యలో వచ్చాయని ఫ్రాన్స్ గృహ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతర్జాతీయ ప్రయాణాలు, కీటకసంహార మందులకు నిరోధకత పెరగడం వల్లే వాటి సంఖ్య పెరుగుతోందని తెలిపింది.
సైమెక్స్ లెక్టులారిస్ అనే శాస్త్రీయనామం గల ఈ కీటకం ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. వెలుతురు ఉన్నపుడు దాక్కుని చీకట్లో బయటికి వచ్చి మనుషుల రక్తం తాగే ఈ నల్లులు నిద్రపట్టకుండా చేస్తాయి. దుస్తులు, బెడ్ షీట్లలో దాక్కుని ఉండటం వల్ల వాటి వ్యాప్తి సులభమవుతోంది. ఒకప్పుడు డీడీటీ సాయంతో వీటిని నాశనం చేశారు. అయితే డీడీటీ ఉత్పత్తి నిషేధించాక వీటి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. కేవలం హోటళ్లు, ఇళ్లలోని దుస్తులలోనే కాకుండా వస్త్రాల దుకాణాల్లోని దుస్తులకు వీడి బెడద తప్పలేదు. విక్టోరియా సీక్రెట్ వంటి బ్రాండ్ కంపెనీలు కూడా వీటి దాడికి నిలదొక్కుకోలేక ఇబ్బందులు పడ్డాయి. వీటి నిర్మూలన కోసం బిలియన్ల డబ్బు ఖర్చవుతోందని, 2018లో దాదాపు 4లక్షల ఇళ్లు, హోటళ్ల నుంచి నల్లుల బెడదకు సంబంధించి కాల్స్ వచ్చాయని పారిస్ ప్రభుత్వ యంత్రాంగం తెలిపింది.
ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని అక్కడి 2020 ఎన్నికల్లో నిలబడబోయే ప్రతినిధులు కూడా వారి మేనిఫేస్టోలో వీటి నిర్మూలన అంశాన్ని చేర్చుకున్నారంటే వీటి తాకిడి తీవ్రత ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.