తల్లిని ప్రోత్సహిస్తున్న పరిణీతి..

by Shyam |
తల్లిని ప్రోత్సహిస్తున్న పరిణీతి..
X

తల్లిదండ్రులు పిల్లలను సపోర్ట్ చేయడంలో ముందుంటారన్న విషయం తెలిసిందే. మనల్ని పెంచేందుకు వారి అభిరుచులను సైతం త్యాగం చేస్తుంటారు. కానీ పిల్లలు కూడా మంచి పొజిషన్‌కు రాగానే తల్లిదండ్రుల అభిరుచులు తెలుసుకుని.. వారిని ప్రోత్సహించవచ్చని చెప్తోంది బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా. ఈ మేరకు తన తల్లి వేసిన పెయింటింగ్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పరిణీతి. ‘మా అమ్మ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ కాదు కానీ.. ప్రొఫెషనల్‌గా పెయింటర్‌గా రాణించాలనేది తన కల’ అని తెలిపింది.

తను పెయింటింగ్ వేయడాన్ని చాలా ఇష్టపడుతుందని.. మనసు పెట్టి చేస్తుందని చెప్పింది. కానీ తనకు పెయింటింగ్ వేయడానికి పెద్ద స్టూడియో, భారీ ప్రొడక్షన్ సెటప్ లాంటివేమీ లేవని.. పాత బెడ్ రూమ్‌లో ఒక చిన్న కుర్చీ, టేబుల్ పెట్టి పనిచేస్తోందని తెలిపింది. ఇంటి పని, వంట పని నుంచి కాస్త విరామం దొరికినప్పుడల్లా.. డ్రాయింగ్ వేస్తుందని చెప్పింది. అయితే ప్రొఫెషనల్‌గా ఈ పని చేయాలనేది తన కల అని అమ్మ ఈ మధ్యే చెప్పిందన్న పరిణీతి.. మీరు తనకు సపోర్ట్ చేయాలనుకుంటే ఆమె వేసిన పెయింటింగ్ ఆర్డర్ చేయొచ్చని తెలిపింది. లేదా మీకు నచ్చిన కలర్ స్కీమ్ చెప్తే.. మీకు నచ్చినట్లుగా పెయింటింగ్ వేసి పంపిస్తామని కూడా చెబుతోంది.

ఇది ఇంతకు ముందెప్పుడూ చేయని అత్యంత హృదయపూర్వకమైన పోస్ట్ అని.. మీ ఇంట్లో తన పెయింటింగ్స్ ప్రదర్శిస్తే చాలా సంతోషిస్తామని చెప్పింది. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఫస్ట్ ఉన్న పెయింటింగ్ ఆల్రెడీ తానే అమ్మ నుంచి కొన్నట్లు తెలిపింది పరిణీతి.

https://www.instagram.com/p/CCxrT0TJ2Us/?igshid=6c63h9c9yxp7

Advertisement

Next Story