సైఫ్‌ను లవ్ చేస్తున్నా.. కరీనాకు కూడా ఓకే : పరిణీతి

by Shyam |
సైఫ్‌ను లవ్ చేస్తున్నా.. కరీనాకు కూడా ఓకే : పరిణీతి
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా.. కరీనా కపూర్ ఖాన్ భర్త సైఫ్ అలీ ఖాన్‌ను ప్రేమిస్తున్నట్లు తెలిపింది. తాజాగా కపిల్ శర్మ షోలో పాల్గొన్న పరిణీతి.. ఈ విషయాన్ని వెల్లడించింది. ‘జబరియ జోడి’ సినిమా ప్రమోషన్స్ కోసం సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి కపిల్ శర్మ షోకు విచ్చేసిన పరిణీతిని.. సినిమా కాన్సెప్ట్ ప్రకారం ఒక వేళ మీరు కిడ్నాప్ చేయాలి అనుకుంటే ఎవరిని కిడ్నాప్ చేస్తారని ప్రశ్నించారు.

దీనికి సమాధానం చెప్పడం కష్టం అంటూనే.. ఒకరిని కలిసేందుకు అవకాశం రాకపోతే ఎవరిని కిడ్నాప్ చేస్తానంటే.. సైఫ్‌ను అని చెప్పేసింది. తన దగ్గర ఉంటే చాలా సేఫ్ అన్న పరిణీతి.. తను సైఫ్‌ను లవ్ చేస్తున్నట్లు కరీనాకు కూడా చెప్పానని అంది. అందుకు తను కూడా సరే అందని చెప్పింది. అయితే ఆ ప్రేమను దూరం నుంచే కొనసాగిస్తానని తెలిపింది పరిణీతి.

అయితే దీనిపై సెటైర్ వేశాడు కపిల్. నాకు కూడా ఇలా దూరం నుంచి లవ్ చేసే కాన్సెప్ట్ నచ్చిందన్న కపిల్.. వచ్చే జన్మలో సైఫ్‌గా పుట్టాలి అనుకుంటున్నానని చెప్పాడు.

Advertisement

Next Story