వేరే మతస్థులు దర్శించుకుంటే డిక్లరేషన్ తప్పనిసరి

by srinivas |
వేరే మతస్థులు దర్శించుకుంటే డిక్లరేషన్ తప్పనిసరి
X

దిశ, తెలంగాణ బ్యూరో: హిందువులు కాని వారు తిరుమలను దర్శించుకోవాలంటే సంతకం పెట్టాలన్న నిబంధన డిక్లరేషన్‌లో చాలా ముఖ్యమైందని స్వామి పరిపూర్ణానంద తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో స్వామి పరిపూర్ణానంద బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. తిరుపతిలో డిక్లరేషన్ వ్యవస్థ హిందువులు పెట్టింది కాదని, ఆంగ్లేయులే 43 పాయింట్లతో కూడిన డిక్లరేషన్‌ను పొందుపరిచారని ఆయన పేర్కొన్నారు. కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయన కూడా తిరుమలకు వెళ్లాలంటే డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని స్వామీజీ డిమాండ్ చేశారు. భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తిరుమల దర్శనం చేసుకునే సందర్భంలో డిక్లరేషన్‌పై సంతకం చేసి దర్శనం చేసుకున్నారని, ఆయనను ఆదర్శంగా తీసుకొని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాలని స్వామి సూచించారు. అలా చేయడం వల్ల సీఎంగా ఆయన ఒక స్పూర్తి దాయకమైన సందేశం ఇచ్చినట్టుగా ఉంటుందని పరిపూర్ణానంద చెప్పారు. జగన్ హిందువు అని, క్రైస్తవుడని నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

Advertisement

Next Story